Thursday, January 30, 2025
HomeఆటChampions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు ఎప్పుడంటే..?

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు ఎప్పుడంటే..?

పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ(Champions Trophy 2025) ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రోఫీ ప్రారంభ వేడుకలకు సంబంధించి షెడ్యూల్‌ ఖారారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 16న లాహోర్‌ వేదికగా ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు దిగ్గజ క్రికెటర్లు, క్రికెట్ బోర్డుల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను ఆహ్వానించారట. ప్రారంభ వేడుకల్లో ఎనిమిది జట్ల కెప్టెన్ల ప్రెస్ మీట్‌లు, ఫొటో షూట్‌లు ఉండనున్నాయి. అయితే ఈ వేడుకల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పాల్గొనడంపై ఇంకా క్లారిటీ రాలేదు.

- Advertisement -

తొలి మ్యాచ్‌ పాకిస్థాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా జరగనుంది. ఇక భారత్ మ్యాచులన్నీ దుబాయ్‌ వేదికగా జరగనున్నాయి. ఒకవేళ భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్‌ కూడా దుబాయ్‌లోనే జరగనుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. కానీ ఆతిథ్య పాకిస్థాన్ మాత్రం ఐసీసీ ఇచ్చిన గడువు ముగిసినా ఇంతవరకు జట్టును ప్రకటించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News