Thursday, February 20, 2025
HomeఆటChampions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్ము రేపిన టీమిండియా ఆటగాళ్లు ఎవరంటే.?

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్ము రేపిన టీమిండియా ఆటగాళ్లు ఎవరంటే.?

క్రీడా ప్రేమికులు ఎదురు చూస్తున్న.. ఈనెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. దీనికోసం రోహిత్ సేన దుబాయ్ కి చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించారు. టీమిండియా ఛాంపియన్స్‌లో తొలి మ్యాచ్‌ ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా పాకిస్థాన్‌ చేతిలో 180 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎనిమిదేళ్ల క్రితం కప్‌ను చేజార్చుకున్నప్పటికీ టీమిండియా ఇప్పుడు ఫేవరెట్‌ టీమ్‌లలో ఒకటిగా ఈ పోటీలో నిలుస్తోంది. భారత జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి రికార్డు ఉంది. ఈ ట్రోఫీని మనవాళ్లు రెండుసార్లు సొంతం చేసుకున్నారు. ఇక దీనిలో టీమిండియా ఆటగాళ్ల రికార్డులు మామూలుగా లేవు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

శిఖర్ ధావన్: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా నుంచి అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో శిఖర్ ధావన్ మొదటి స్థానంలో ఉన్నాడు. 10 ఇన్నింగ్స్‌లు ఆడిన ధావన్.. 77.88 సగటుతో.. 102 స్ట్రైక్ రేట్ తో 701 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి.

సౌరవ్ గంగూలీ: టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ టైగర్ సౌరవ్‌ గంగూలీకి ఛాంపియన్స్ ట్రోఫీలో గొప్ప చరిత్ర ఉంది. 11 ఇన్నింగ్స్‌లలో 73.88 సగటు, 83.22 స్ట్రైక్ రేట్ తో 665 పరుగులు సాధించారు. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి. టీమిండియా నుంచి అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో గంగూలీ 2వ స్థానంలో ఉన్నాడు.

రాహుల్ ద్రవిడ్: ఇక రాహుల్ ద్రవిడ్ ఛాంపియన్స్ ట్రోఫీలో 15 ఇన్నింగ్స్‌లలో 48.23 సగటుతో, దాదాపు 75 స్ట్రైక్ రేట్‌తో 627 పరుగులు చేశాడు. ఆరు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. టోర్నమెంట్ చరిత్రలో టీమిండియా నుంచి అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో ద్రవిడ్‌ 3 స్థానంలో నిలిచాడు.

విరాట్ కోహ్లీ: రన్ మిషీన్ విరాట్ కోహ్లీకి కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి రికార్డ్ ఉంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 12 ఇన్నింగ్సులు ఆడిన కోహ్లీ. 88.16 సగటుతో, 90 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 529 పరుగులు సాధించాడు. అతడి అత్యుత్తమ స్కోరు 96 నాటౌట్. ఈ సారి కోహ్లీ రాణిస్తే చాలా రికార్డులు బ్రేక్ అవుతాయి.

రోహిత్ శర్మ: కొంత కాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడ్డ రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో సత్తా చాటాడు. ఇదే జోరు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రోహిత్ గత ఛాంపియన్స్ ట్రోఫీలో 10 మ్యాచ్‌ల్లో 53.44 సగటుతో, 82.50 స్ట్రైక్ రేట్‌తో 481 పరుగులు చేశాడు. అందులో నాలుగు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో టీమిండియా నుంచి అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో రోహిత్ 5వ స్థానంలో ఉన్నాడు. మరి ఈ సారి ఎన్ని రికార్డులు బ్రేక్ అవుతాయో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News