ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మరోసారి టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత జట్టులో ఓ మార్పు జరిగింది. పేసర్ హర్షిత్ రాణా స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు లభించింది. ఇరు జట్లు లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచి గ్రూప్ ఏ నుంచి సెమీస్‌కు దూసుకెళ్లాయి. ఈ మ్యాచ్‌లో విజయాన్ని బట్టి సెమీస్ బెర్తులు ఖరారుకానున్నాయి.
భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్ జట్టు: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓరూర్కే