Tuesday, September 17, 2024
HomeఆటChigurumamidi: డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన అల్గునూర్ జట్టు

Chigurumamidi: డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన అల్గునూర్ జట్టు

చిగురుమామిడి మండలం ఇందుర్తి, ఓగులాపూర్ గ్రామాల మధ్యలో గల క్రికెట్ గ్రౌండ్ లో ఐ.వో.సి టోర్నమెంట్ నిర్వాహకులు గత నెల రోజులుగా నిర్వహిస్తున్న డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం రోజు ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందుర్తి, ఓగులాపూర్, అల్గునూర్ జట్లు పోటీ పడగా అల్గునూర్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం గెలుపొందిన అల్గునూర్ క్రిడాకారులకు విన్నర్ కప్ ను ఇందుర్తి ఎంపీటీసీ అందె స్వప్న అందజేయగా రన్నర్ గా నిలిచిన ఇందుర్తి, ఓగులాపూర్ క్రీడాకారులకు రన్నర్ కప్ ను సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ అందజేశారు విన్నర్ మ్యాచ్ కు ప్రైజ్ మనీ క్రింద పదివేల రూపాయలను లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,జర్నలిస్ట్ గాదె రఘునాథరెడ్డి అల్గునూర్ టీమ్ కు అందజేశారు మ్యానప్ ది సిరీస్ కింద అజయ్ కు మెమోంటో ను సీపీఐ మండల సహాయ కార్యదర్శి అందె చిన్న స్వామి అందజేశారు ఈ సందర్భంగా ఎంపీటీసీ స్వప్న,సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సదాశివ మాట్లాడుతూ గత నెల రోజులుగా కరీంనగర్ డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన మేనేజ్మెంట్ క్రీడాకారులకు అభినందనలు అని క్రీడారంగంలో ఏ ఆటలో నైనా గెలుపు ఓటములు సహజమని,గెలిచిన వారు మరింత ముందుకు వెళ్లాలని,ఓటమి చెందిన వారు గెలుపును స్ఫూర్తి గా తీసుకొని భవిష్యత్తు లో గెలుపు కోసం కృషి చేయాలని,క్రీడలు స్నేహపూరిత వాతావరణంలో జరగాలని,క్రీడాకారులు తమ దేహదారుఢ్యాన్ని పెంపొందించు కోవాలని,క్రీడల్లో తమ నైపుణ్యతను ప్రదర్శించాలని భవిష్యత్ క్రీడాకారులకు ఆదర్శంగా ఉండాలని స్వప్న,సదాశివ క్రీడాకారులకు సూచించారు.

- Advertisement -

క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి నెల రోజులు అనేక మ్యాచ్ లు నిర్వహించడం అభినందనీయమని వారికి స్వప్న, సదాశివ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథ్ రెడ్డి,ఐ.వో.సి క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు గట్టు మహర్షి,అందె పవన్, ప్రదీప్, లడ్డు,టింకు,హరీష్ లతో పాటు బూడిద కుమార్,జెమిని,ప్రకాష్ వివిధ గ్రామాల ప్లేయర్స్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News