Tuesday, September 17, 2024
HomeఆటCM Cup: ప్రతిష్ఠాత్మకంగా సీఎం కప్

CM Cup: ప్రతిష్ఠాత్మకంగా సీఎం కప్

సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని,రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ఇనుమటింపజేసేలా సీఎం కప్ ను నిర్వహణ ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. మండల, జిల్లా స్థాయి లో నిర్వహించిన సీఎం కప్ పోటీలను విజయవంతం అయ్యాయని, రాష్ట్రస్థాయిలో జరగబోయే సీఎం కప్ క్రీడా పోటీలలో 18 క్రీడాంశాల్లో సుమారు 9000 మంది క్రీడాకారులు, కోచ్ లు పాల్గొంటారన్నారు శ్రీనివాస్ గౌడ్. అలాగే, రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించాలని, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో పాల్గొనడానికి వివిధ జిల్లాల నుంచి వస్తున్న క్రీడాకారులకు పౌష్టిక ఆహారం వసతి, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

- Advertisement -

సీఎం కప్ దేశానికి తలమానికంగా నిలిచేలా అధికారులు కృషి చేయాలని, సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలలో భాగంగా క్రీడా మైదానాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ నెల 29 న రాష్ట్ర స్థాయిలో జరిగే సీఎం కప్ ప్రారంభోత్సవం ను ఘనంగా నిర్వహించాలని, ఈ ప్రారంభోత్సవంలో క్రీడా అవార్డు గ్రహీతలైన (అర్జున, పద్మశ్రీ, పద్మభూషణ్, ఖేల్ రత్న) వారిని ఘనంగా సన్మానించాలన్నారు మంత్రి. సీఎం కప్ ప్రారంభోత్సవ వేడుక లలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని, హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATS) ఆధ్వర్యంలో మే 28 నుండి 31 వరకు సీఎం కప్ ను 6 క్రీడా స్టేడియంలో ఘనంగా నిర్వహించాలన్నారు. సీఎం కప్ ప్రారంభోత్సవ వేడుకలలో సంస్కృతి కార్యక్రమాలు రసమయి బాలకిషన్ సారధ్యంలో ప్రదర్శిస్తామన్నారు.

తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ దీపికా రెడ్డి నాట్య ప్రదర్శనతో పాటు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సంగీత కార్యక్రమాలు క్రీడాకారులను క్రీడాభిమానులను అలరించబోయే విధంగా నిర్వహించాలని మంత్రి అదేశించారు. సీఎం కప్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహణపై హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, అనంతరం రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ధరించే జెర్సీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో SATS – OSD డా. లక్ష్మీ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి మనోహర్, SATS ఉన్నతాధికారులు సుజాత, ధనలక్ష్మి, DYSO లు సుధాకర్, వెంకటేశ్వరరావు, రవీందర్ , తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ సెక్రెటరీ ప్రేమ్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News