భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మరో అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ఈ ఏడాది క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) ప్రకటించిన టెస్టు టీమ్ ఆఫ్‌ది ఇయర్‌కు కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. ఈ జట్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌కు కూడా చోటు దక్కడం విశేషం.
ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొత్తం 84 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 30 వికెట్లను పడగొట్టాడు. ఇక జైస్వాల్ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. మొత్తం 15 మ్యాచ్‌లు ఆడి 1478 పరుగులు సాధించాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా జట్టు: జైస్వాల్ (భారత్), బెన్ డక్కెట్(ఇంగ్లాండ్), జోరూట్ (ఇంగ్లాండ్), రచిన్ రవిచంద్ర (న్యూజిలాండ్), హారీ బ్రూక్ (ఇంగ్లాండ్), కమింద్ మెండిస్ (శ్రీలంక), అలెక్స్ కేరీ (ఆస్ట్రేలియా), మాట్ హెన్రీ (న్యూజిలాండ్), బుమ్రా(కెప్టెన్) (భారత్), హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా), కేశవ్ మహరాజ్ (దక్షిణాఫ్రికా)