టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ(MS Dhoni) మరో రికార్డుకు చేరువయ్యాడు. ఐపీఎల్‌లో భాగంగా కాసేపట్లో జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదు కానుంది. ఈ మ్యాచ్ ధోనీ ఖాతాలో 400వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. ఈ అరుదైన మైలురాయిని అందుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా ధోనీ చరిత్ర సృష్టించనున్నాడు. ధోనీ కంటే ముందు భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ (456 మ్యాచ్‌లు), దినేశ్ కార్తిక్ (412 మ్యాచ్‌లు), విరాట్ కోహ్లీ (408 మ్యాచ్‌లు) ఈ ఘనతను సాధించారు.
- Advertisement -
ఈ మైలురాయితో పాటు ధోనీ మరో రికార్డును కూడా సొంతం చేసుకోనున్నాడు. 400 టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో భారత వికెట్ కీపర్‌గా నిలవనున్నాడు. ఇంతకుముందు దినేశ్ కార్తిక్ మాత్రమే వికెట్ కీపర్‌గా భారత్ నుంచి ఈ ఘనతను అందుకున్నాడు.