Saturday, April 19, 2025
HomeఆటDC vs GT: గుజరాత్‌ టార్గెట్‌ ఎంతంటే..?

DC vs GT: గుజరాత్‌ టార్గెట్‌ ఎంతంటే..?

ఐపీఎల్‌ 2025లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న గుజరాత్‌ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌(DC vs GT) మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (39), అశుతోష్‌ శర్మ (37), కరుణ్‌ నాయర్‌ (31), స్టబ్స్‌ (31) పరుగులతో రాణించారు. ఇక గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ నాలుగు వికెట్లు తీశాడు. 18వ ఓవర్‌లో వరుస బంతుల్లో అక్షర్‌, విప్రజ్‌ను ఔట్‌ చేశారు. సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, ఇశాంత్‌ శర్మ, సాయికిశోర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇక ఇప్పటివరకు ఢిల్లీ 7 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉండగా.. గుజరాత్ 6 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని ఇరు జట్టు భావిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News