Monday, November 17, 2025
HomeఆటDevanakonda: మహిళా కబడ్డీ విజేత విజయవాడ

Devanakonda: మహిళా కబడ్డీ విజేత విజయవాడ

అంతర్రాష్ట్ర మహిళా కబడ్డీ పోటీల్లో విజయవాడ జట్టు ఛాంపియన్ గా ట్రోఫీ చేజిక్కించుకుంది. దేవనకొండ మండల పరిధిలోని గుడిమిరాళ్ల గ్రామంలో శ్రీదస్తగిరి స్వామి ఉరుసు సందర్భంగా నిర్వహించిన అంతర్రాష్ట్ర మహిళా కబడ్డీ పోటీలలో విశేష ప్రతిభ కనబరచి విజేతగా విజయవాడ మహిళా జట్టు నిలచింది. ఈ నెల 2, 3 వ తేదీలలో ఈ పోటీలు నిర్వహించగా విజయవాడ జట్టు మొదటి బహుమతి రూ.50 వేలు గెలుపొందింది. ద్వితీయ విజేతగా శ్రీకాకుళం మహిళా జట్టు నిలచి రూ.40 వేలు బహుమతిగా, తృతీయ స్థానంలో ఖమ్మం మహిళా జట్టు నిలచి రూ.30 వేలు, నాలుగవ స్థానంలో కేరళ రాష్ట్రానికి చెందిన మహిళా జట్టు నిలచి రూ.20 వేలు బహుమతులు పొందారు. గెలుపొందిన జట్లకు బహుమతులను గ్రామపెద్దలు అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad