భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 22 నుంచి ఐదు టీ20ల సిరీస్ (IND vs ENG) ప్రారంభంకానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ రేపు(బుధవారం)జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఓరోజు ముందే ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. ఆల్ రౌండర్లు లివింగ్‌స్టన్, జాకబ్ బేథల్‌లకు జట్టులో స్థానం దక్కింది. ఇక ఫాస్ట్ బౌలర్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్ కాస్త గ్యాప్ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ జట్టుకు జోస్ బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
ఐదు టీ20ల సిరీస్ షెడ్యూల్..
జనవరి 22- తొలి టీ20 (కోల్‌కతా)
జనవరి 25- రెండో టీ20 (చెన్నై)
జనవరి 28- మూడో టీ20 (రాజ్‌కోట్)
జనవరి 31- నాలుగో టీ20 (పుణె)
ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)