Sunday, December 22, 2024
HomeఆటENGLAND TEAM: భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన.. రూట్ రీ ఎంట్రీ

ENGLAND TEAM: భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన.. రూట్ రీ ఎంట్రీ

వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)తో పాటు భారత్ పర్యటనకు ఇంగ్లాండ్ జట్టును(ENGLAND TEAM) ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 15 మందితో కూడిన జట్లు స్టార్ హిట్టర్ జోస్ బట్లర్(Jos Buttler) నాయకత్వం వహిస్తాడు. ఇక జో రూట్(Joe Root) తిరిగి వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. చివరిసారిగా గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

- Advertisement -

ఇక టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జనవరి 17న ఇంగ్లాండ్ జట్టు భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరు జట్లకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడనుంది

జట్టు ఇదే: జోస్ బట్లర్(కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డక్కెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జోరూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్‌వుడ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News