భారత్, ఇంగ్లండ్(IND vs ENG) మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో వన్డే జరుగుతోంది. కటక్‌లోని బారాబతి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక మోకాలి నొప్పితో తొలి వన్డేకు దూరమైన భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. యశస్వి జైశ్వాల్‌ను తప్పించి కోహ్లీకి చోటు కల్పించారు. ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఆరంగేట్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టు 9ఓవర్లకు 66/0 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉంది. కాగా తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించడం తెలిసిందే.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లండ్ జట్టు: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్‌సన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్, సకిబ్ మహమూద్