ఫార్ములా వన్ డ్రైవర్స్ రాజకీయ అంశాలపై ఇష్టానుసారం నోరుపారేసుకోకుండా అడ్డుకునే కొత్త స్పోర్ట్స్ కోడ్ అమలులోకి వచ్చింది. ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ లేటెస్ట్ స్టేట్మెంట్ ప్రకారం..ఎఫ్ 1 డ్రైవర్స్ ఎటువంటి వివాదాస్పద కామెంట్స్ చేయకూడదంతే. ఇలా చేయాలనుకుంటే ముందే అవసరమైన పర్మిషన్స్ తీసుకోక తప్పదు. రాజకీయ, మత, వ్యక్తిగత దూషణలకు సంబంధించిన ఎటువంటి అంశాలపై కూడా వీరు నోరు విప్పకూడదంటూ ఎఫ్ఐఏ రూల్స్ తెచ్చింది.
F1 డ్రైవర్లు రేసింగ్ సూట్లు మాత్రమే వాడాలి. రేసింగ్ సూట్లు తప్ప ఎటువంటి కాంట్రవర్సీ వర్డ్స్, సెంటెన్సెస్, స్లోగన్స్ లేకుండా పోడియం సెర్మనీస్ లో కేర్ తీసుకోక తప్పదు. పోస్ట్ రేస్ ఇంటర్వ్యూల్లో కూడా పర్ఫెక్ట్ ప్రోటోకాల్ డ్రెస్ లో ఉండి తీరాల్సిందే. సెబాస్టియన్ విట్టల్, హామిల్టన్ వంటి డ్రైవర్స్ ఎల్ జీబీటీతోపాటు పలు కాంట్రవర్సీస్ పై పదేపదే మాట్లాడేవారు. పొలిటికల్ న్యూట్రాలిటీ తేవటం కోసమే ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ కోడ్ లో ఇన్ని భారీ మార్పులు తెచ్చినట్టు ఎఫ్ఐఏ చెబుతోంది.