Wednesday, April 16, 2025
HomeఆటZaheer Khan: తండ్రి అయిన మాజీ క్రికెటర్ జహీర్‌ ఖాన్‌

Zaheer Khan: తండ్రి అయిన మాజీ క్రికెటర్ జహీర్‌ ఖాన్‌

టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్‌ ఖాన్‌ (Zaheer Khan) తండ్రి అయ్యారు. ఆయన సతీమణి, నటి సాగరిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ కుమారుడికి ఫతేసిన్హ్‌ ఖాన్‌ అని పేరు పెట్టినట్లు తెలిపారు. దీంతో ఈ జంట‌కు సోషల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

కాగా 2017లో జహీర్, సాగరిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు 8 ఏళ్ల త‌రువాత ఈ జంట త‌ల్లిదండ్రులు అయ్యారు. షారుక్‌ ఖాన్‌ నటించిన ‘చక్‌ దే ఇండియా’తో సాగరిక బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. ఇక జహీర్ ఖాన్ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News