విద్యార్థి దశ నుండే మెళకువలు నేర్చుకుంటే బాస్కెట్ బాల్ లో రాణించవచ్చన్నారు నిపుణులు. అందుకు ఇలాంటి ఫ్రీ సమ్మర్ కోచింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్సై జీనత్ కుమార్ అన్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆదేశాల మేరకు గార్ల మండల కేంద్రంలోని స్థానిక నూతన జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ భవనం ప్రాంగణంలో బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాస్కెట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎస్సై జీనత్ కుమార్ ప్రారంభించారు.
వేసవి కాలంలో ఏర్పాటు చేసిన ఉచిత బాస్కెట్ బాల్ కోచింగ్ శిక్షణా తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, బాస్కెట్ బాల్ పై ఆసక్తి గలవారు ఎవరైనా ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనవచ్చని తెలిపారు. అనంతరం పిల్లలకు అరటి పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బాస్కెట్ బాల్ క్రీడాకారులు జయశంకర్ శ్రీనివాస్ ప్రశాంత్ చంద్రశేఖర్ రమేష్ మధు ఉమేష్ అలవాల పవన్ సోమంత్ ఎజాస్ కోటేష్ నరసింహారావు వివేక్ సిద్ధార్ ధనుష్ కత్తి బాలరాజు పిల్లలు పాల్గొన్నారు.