క్రీడా పోటీల్లో గెలుపు ఓటమి సహజమని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ అన్నారు. ఆదివారం గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి మినీ క్రీడా మైదానంలో గార్ల బయ్యారం సర్కిల్ పోలీస్ గార్ల బయ్యారం విలేకరులతో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన గార్ల ప్రెస్ టీం బాలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ఎంచుకున్న పోలీస్ టీం 10 ఓవర్లకు గాను 90 పరుగులు చేయగా బ్యాటింగ్ పట్టిన గార్ల ప్రెస్ టీం 46 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు అనంతరం బయ్యారం ప్రెస్ పోలీస్ టీమ్ కు జరిగిన మ్యాచ్ లో పోలీస్ టీం 86 పరుగులు తీసి 4 వికెట్లతో నష్టపోగా 9 ఓవర్లలో 4 బంతులు మిగలగా రెండు బంతులలో 6 వికెట్ల తేడాతో బయ్యారం ప్రెస్ జట్టు విజయాన్ని సాధించారు. ప్రథమ స్థానంలో నిలిచిన బయ్యారం ప్రెస్ టీంకు ద్వితీయ స్థానంలో నిలిచిన పోలీస్ టీంకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను కైవసం చేసుకున్న బయ్యారం ఎస్సై తిరుపతికి సీఐ రవికుమార్ బహుమతులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి దోద పడతాయని స్నేహపూర్వక ఈ క్రికెట్ మ్యాచ్ లో ఓటమి పొందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురికాకుండా గెలుపొందినందుకు కృషి చేయాలి అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న ప్రెస్ టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రికెట్ పోటీలకు వ్యాఖ్యాతగా మాలోత్ శాంతి కుమార్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో గార్ల ఎస్ఐ జీనత్ కుమార్ బయ్యారం ఎస్ఐ తిరుపతి పోలీస్ సిబ్బంది గార్ల బయ్యారం ప్రెస్ టీం సోమయ్య సురేందర్ సతీష్ సంపసాల వెంకటేశ్వర్లు నీలం శ్రీనివాస్ వెంకట్ రమణ ప్రశాంత్ రాము శ్రీకాంత్ మండల రవి ప్రభాకర్ రెడ్డి సింగార రమేష్ ఇంద్రారెడ్డి రాజేష్ థామస్ జనార్ధన్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.