Saturday, October 5, 2024
HomeఆటGuvvala Balaraju: గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆడేందుకు కృషి

Guvvala Balaraju: గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆడేందుకు కృషి

దినేష్ మన ప్రాంతానికి గర్వకారణం

గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆడేందుకు తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శాంతకుమారితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అచ్చంపేట మండలం చేదురుబావి తండాకు చెందిన రాత్లావత్ దినేష్ నాయక్ అండర్-19 తెలంగాణ స్టేట్ కి ఎంపిక కావడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఇటువంటి క్రీడాకారుడుని ప్రోత్సహించి జాతీయస్థాయి క్రీడా పోటీల్లో ఆడేందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. దినేష్ కి తండ్రి లేకున్నా తల్లి కూలీ పనులు చేస్తూ ప్రోత్సహించడం ఆ తల్లికి కొడుకుపై ఉన్న ప్రేమ అమోగయోగ్యమైనదని పేర్కొన్నారు.

- Advertisement -


గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వారికి తోడుగా నిలుస్తుందన్నారు. అచ్చంపేటలో త్వరలో అచ్చంపేట ప్రీమియర్ లీగ్ (APL) సంబంధించినటువంటి టోర్నమెంట్ త్వరలోనే నిర్వహిస్తామని వివరించారు. క్రీడాకారుడు దినేష్ కి కావలసినటువంటి అన్ని విధాల సహాయం చేస్తానని పేర్కొన్నారు. అనంతరం క్రీడాకారుడు దినేష్ నాయక్ ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, మాజీ మున్సిపల్ చైర్మన్ తులసీరాం నాయక్, సీనియర్ నాయకులు అమీనొద్దీన్, స్ధానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News