Tuesday, April 8, 2025
HomeఆటHand ball Champs: హ్యాండ్ బాల్ ఛాంపియన్ పశ్చిమగోదావరి

Hand ball Champs: హ్యాండ్ బాల్ ఛాంపియన్ పశ్చిమగోదావరి

కర్నూలుకు రజితం, నంద్యాలకు కాంస్యం

52వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ లో పశ్చిమగోదావరి జట్టుకు స్వర్ణంతో ఛాంపియన్షిప్ కైవశం చేసుకుంది. అలాగే కర్నూలు జట్టు రజిత పతకాలు, నంద్యాలకు కాంక్ష పతకాలు దక్కాయి.

- Advertisement -

డాక్టర్ కె రామలింగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ముగింపు కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ లు కలిసి ట్రోఫీలు పతకాలు ప్రతిభ పత్రాలను అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రామాంజనేయులు, నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ మహబూబ్ బాషా కోశాధికారి రాజ్ కుమార్ రెడ్డి, ఆయా జిల్లా క్రీడా సంఘ ప్రతినిధులు లక్ష్మణ్, జాన్ దత్త రావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముగింపులో రామలింగారెడ్డి మహిళా కళాశాల విద్యార్థులు నృత్య, గేయాలతో వీడ్కోలు పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News