ఇంగ్లాండ్ వైట్ బాల్ క్రికెట్‌కు జోస్ బట్లర్(Jos Buttler) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త కెప్టెన్‌ను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ (Harry Brook)కు వన్డేలు, టీ20ల్లో సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. ఇంగ్లాండ్‌కు నాయకత్వం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని బ్రూక్ తెలిపాడు.
కాగా ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. లీగ్ దశలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో జోస్ బట్లర్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను దృష్టిలో పెట్టుకుని హ్యారీ బ్రూక్‌ను సారథిగా నియమించారు. 26 ఏళ్ల బ్రూక్ ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 18 సీజన్‌కు బ్రూక్ దూరంగా ఉన్నాడు.