సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని గోవిందపురంలో అంబేద్కర్ లయన్స్, మహాత్మ జ్యోతిరావు పూలే సంఘాల ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు రెండు రోజులపాటు నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బ్యాడ్మింటన్ పోటీల్లో పది టీములు, 22 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గురు, శుక్రవారాలు నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో సెమీ ఫైనల్ లో కోల నాగేశ్వరరావు & పాలడుగు రాజు అండ్ టీంతో పాటు బండి భాస్కర్ & గొట్టేముక్కుల శ్రీనివాస్ ల టీం పోటీపడ్డాయి.సెమీఫైనల్ లో భాస్కర్ టీంపై కోల టీం సంచలన విజయం సాధించింది. అనంతరం ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఫైనల్ లో కోలా అండ్ సామరాజు టీంలు తలపడ్డాయి.
మొదటి బహుమతి సామరాజు, ద్వితీయ బహుమతి కోల నాగేశ్వరరావు టీంలు గెలుపొందాయి. మొదటి, ద్వితీయ స్థానం సాధించిన కోలా నాగేశ్వరరావు, సామ రాజు టీమ్లను క్రీడల కమిటీ చైర్మన్ భాస్కర్ అభినందించారు. విజేతలకు బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై చిలకపత్తిని ధనుంజయ్,కౌన్సిలర్ సౌజన్య, డిజే,పాలడుగు ధనుంజయ, నిర్వాహకులు కమిటీ చైర్మన్ బండి భాస్కర్,అంపైర్ బాల బోయిన వినోద్ కుమార్,గొర్రె వీరబాబు,జెట్టి ప్రసాద్,విష్ణు,గొట్టిముక్కల శ్రీనివాస్,ఆసోదు శ్రీనివాస్,పాలడుగు శ్రావణ్,పత్తిపాటి ప్రసాదు,ఇటీమల మధు,తెల్ల మల్ల మధు,బాపనపల్లి వేణు పాల్గొన్నారు.