Thursday, September 19, 2024
HomeఆటHyd: అఖిల భార‌త ప్ర‌జా ర‌వాణా సంస్థ‌ల‌ కబడ్డీ టోర్నమెంట్‌ ప్రారంభం

Hyd: అఖిల భార‌త ప్ర‌జా ర‌వాణా సంస్థ‌ల‌ కబడ్డీ టోర్నమెంట్‌ ప్రారంభం

హైదరాబాద్ శివారు హకీంపేటలోని ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీలో అఖిల భార‌త ప్ర‌జా ర‌వాణా సంస్థ‌ల‌ టోర్నమెంట్‌-2023′ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తో కలిసి ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు ప్రారంభించారు. అనంతరం మహారాష్ట్ర ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ జట్ల మధ్య జరిగిన కబడ్డీ మ్యాచ్ ని వీక్షించారు.
”ఆర్టీసీ సిబ్బంది విధి నిర్వ‌హ‌ణ‌లో అంకిత‌భావ సేవ‌లు అందిస్తున్నారు. మంచి ఆహార‌పు అల‌వాట్ల‌ను ఏర్ప‌ర‌చుకోవాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు ఉత్ప‌న్న‌మ‌య్యే అవకాశాలు లేక‌పోలేదు. కావున‌, ఆర్టీసీ ఉద్యోగులు రోజువారీ జీవన విధానాన్ని మ‌రింత మెరుగుప‌రుచుకోవాలి. ఆరోగ్యం కోసం యోగా, మెడిటేషన్‌ చేయాలి. పుస్తకాలను చదవాలి.” అని ద్వారక తిరుమల రావు సూచించారు. ఆలోచన విధానం మంచిగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.

- Advertisement -

టీఎస్ఆర్టీసీకి ఉన్న హకీంపేట ట్రాన్స్ పోర్ట్ అకాడమీ లాంటి సదుపాయాలు దేశంలోని ఏ ఇతర ఆర్టీసీలకు లేవని కితాబిచ్చారు. ”క్రీడల్లో అందరూ గెలుపు ముఖ్యం అనుకుంటారు. పాల్గొనడం కూడా గెలుపే. క్రీడల్లో గెలుపోటములను సమానంగా చూడాలి. క్రీడల వల్ల శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ అన్నారు. ఈ కబడ్డీ టోర్నమెంట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ మహారాష్ట్ర, హర్యానా ఆర్టీసీలతో పాటు నవీ ముంబై, బృహణ్‌ ముంబై, పుణే మహానగర్‌ పరివాహన్‌, బెంగళూరు మెట్రోపాలిటన్ ప్ర‌జా ర‌వాణా సంస్థ‌లు పాల్గొంటున్నాయని, ఆయా టీమ్ లకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తరపున స్వాగతం పలుకుతున్నామన్నారు.



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News