Thursday, April 10, 2025
HomeఆటOlympic day run: ఒలింపిక్ డే రన్

Olympic day run: ఒలింపిక్ డే రన్

ప్రముఖ క్రీడాకారులకు సత్కారం

రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి . శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాదులోని ప్రఖ్యాత లాల్ బహుదూర్ స్టేడియంలో ఒలింపిక్ డే రన్ సందర్భంగా నిర్వహించిన ముగింపు వేడుకలలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఒలంపిక్ జ్యోతిని స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రముఖ క్రీడాకారులను ఈ సందర్భంగా సత్కరించి అభినందించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మాజీ మంత్రి వేణుగోపాల చారి ఒలింపిక్ డే రన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ క్రీడా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రెటరీ జగదీశ్వర్ యాదవ్ ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్, మర్రి లక్ష్మణ్ రెడ్డి, అర్జున అవార్డు గ్రహీతలు అనూప్ యామా, పారా ఒలింపిక్ క్రీడాకారులు అంజనా రెడ్డి, వివిధ క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, క్రీడాకారులు క్రీడాభిమానులు, కోచ్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News