క్రీడాకారులకు మెరుగైన, అద్భుతమైన పౌష్ఠిక ఆహారాన్ని అందిస్తున్నట్టు, రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ వేదికలపై చాటుతున్న క్రీడాకారులను గుర్తించి వారికి నగదు ప్రోత్సకాలను అందిస్తున్నట్టు క్రీడా శాఖామంత్రి శ్రీనివాస గౌడ్ అన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నట్టు ఆయన వివరించారు. క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల క్రీడాకారులు ఇటీవల జరిగిన జాతీయ స్థాయి చాంపియన్ షిప్ లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి క్రీడా పతకాలు సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో మంత్రి పాల్గాొన్నారు.
తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలకు చెందిన క్రీడాకారులు ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో మార్చి 10 నుండి 12 వరకు జరిగిన 18 వ జాతీయ యువజన అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో హకీంపేట క్రీడా పాఠశాల చెందిన పలువురు క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి పలు బంగారు, రజత పతకాలు సాధించిన సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్. ఆంజనేయ గౌడ్ తో కలిసి మంత్రి అభినందించారు.
రాష్ట్రంలో అద్భుతమైన క్రీడా పాలసీ రూపొందించామన్నారు. త్వరలో క్రీడా పాలసీని క్యాబినెట్ ఆమోదిస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడా మైదానాలను, ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను నిర్మించామన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నమన్నారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడ పాఠశాలలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసామన్నారు. క్రీడాకారులకు క్రీడా పాఠశాలలో అద్భుతమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. అందుకు అవసరమైన నిధులను ఇప్పటికే కేటాయించామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – క్రీడా శాఖ అందిస్తున్న సహకారాన్ని క్రీడాకారులు అందిపుచ్చుకొని రాష్ట్రానికి క్రీడా రంగంలో పేరు ప్రఖ్యాతలు తేవాలని మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే అన్ని క్రీడలలో పాల్గొని క్రీడా పథకాలు సాధించాలని అందుకు అవసరమైన పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందనీ మంత్రి క్రీడాకారులకు తెలిపారు.
పతకాలు సాధించిన క్రీడాకారుల వివరాలు. పేర్లు..
1,ఏ. ప్రణతి లలిత్య 100 మీటర్ల హార్దిల్స్ గోల్డ్ మెడల్,
2, ఎస్ హర్షవర్ధన్ 100 మీటర్ల విభాగంలో రజత పతకం & మీడ్ రిలే లో స్వర్ణ పతకం.
3, ఎస్.కె అజారుద్దీన్ మిడ్ – రిలే లో గోల్డ్ మెడల్.
4, ఎం రమేష్ మిడ్ – రిలే లో బంగారు పతకం.
5, జి రాఘవేంద్ర మిడ్ రిలే లో బంగారు పతకం.
6, డి సాయి సంగీత మిడ్ రిలే లో బంగారు పతకం.
ఈ సందర్భంగా వివిధ విభాగాలలో క్రీడా పథకాలను సాధించిన క్రీడాకారులను మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్. హరికృష్ణ, స్పోర్ట్స్ ఆఫీసర్ రతన్ కుమార్ బోస్ మరియు క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు.