Friday, September 20, 2024
HomeఆటChahal becomes Coolie : చాహల్‌ను కూలీని చేసిన ధనశ్రీ.. వీడియో వైర‌ల్‌

Chahal becomes Coolie : చాహల్‌ను కూలీని చేసిన ధనశ్రీ.. వీడియో వైర‌ల్‌

Chahal becomes Coolie : త‌న స్పిన్ బౌలింగ్‌తోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో వెరైటీ వీడియోలు చేస్తూ అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు యుజ్వేంద్ర చాహ‌ల్‌. అయితే.. అత‌డు త‌న భార్య‌కి కూలీగా మారిపోయాడు అని టీమ్ఇండియా కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ చెప్పాడు. అంతేనా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పాటు న‌వ్వులు పంచుతోంది.

- Advertisement -

కివీస్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా తొలి వ‌న్డేలో ఓడిపోగా, రెండో వ‌న్డే వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయ్యింది. ఆఖ‌రిదైన మూడో వ‌న్డేలో విజ‌యం సాధించి సిరీస్‌ను 1-1తో స‌మం చేసేందుకు టీమ్ఇండియా ఆట‌గాళ్లు క్రైస్ట్‌చ‌ర్చ్‌కు బ‌య‌లుదేరారు. క్రికెట‌ర్ల వెంట‌ వారి భార్య‌లు కూడా ఉన్నారు.

ఈ క్ర‌మంలో విమానాశ్ర‌యం ద‌గ్గ‌ర చాహ‌ల్ రెండు చేతుల్లో రెండు సూట్ కేసుల‌తో పాటు మెడ‌కు ఓ బ్యాగు వేసుకుని న‌డుస్తున్నాడు. అత‌డి వెన‌క‌నే అత‌డి భార్య చాలా త‌క్కువ ల‌గేజీతో వ‌స్తుంది. దీన్ని గ‌మ‌నించిన ధావ‌న్ వెంట‌నే త‌న సెల్‌ఫోన్‌కు ప‌ని చెప్పాడు. చాహ‌ల్‌ను ఆట‌ప‌ట్టించాడు. అప్పుడే ధ‌న శ్రీ చాహ‌ల్‌ను కూలీ చేసింద‌ని అన్నాడు.

చాహ‌ల్ న‌వ్వుతూ ముందుకు వెళ్ల‌గా.. వెనుక‌నే వ‌స్తున్న ధ‌న‌శ్రీ తో ధావ‌న్ మాట్లాడుతూ.. ఎందుకు చాహ‌ల్ అధిక బ‌రువుల‌ను మోయ‌వ‌ల‌సి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించాడు. త‌న‌కు కొంచెం కాలి నొప్పి ఉంద‌ని, చాహ‌ల్‌ను ల‌గేజ్‌ను మోయ‌నివ్వండి అని న‌వ్వుతూ చెప్పింది. ఈ వీడియోను ధావ‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్త్ చేయ‌గా నెట్టింట్ట న‌వ్వులు పూయిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News