IND vs ENG Test Series: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయే పరిస్థితిలో ఉంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత బ్యాటర్లు తడబడ్డారు. లంచ్ బ్రేక్ సమయానికి 112/8 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జడేజా(17), బుమ్రా(0) ఉన్నారు. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 81 పరుగులు చేయాల్సి ఉంది.
ఓవర్ నైట్ స్కోర్ 58/4 పరుగులతో చివరి రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి తడబడింది. రిషభ్ పంత్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. జోఫ్రా అర్చర్ వేసి అద్భుతమైన బాల్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజా ఆచితూడి ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాటింగ్‌లో కుదురుకున్నట్లు కనిపించినా కేఎల్ రాహుల్.. స్టోక్స్ వేసిన బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత కష్టాల్లో పడిందిత. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా అర్చర్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో భారత్ 82 పరుగులకే ఏడు కీలక వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. జడేజాకు సహకరం ఇస్తూ స్కోర్ బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లారు. అయితే లంచ్ బ్రేక్ ముందు స్టోక్స్ వేసిన బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ శిబిరంలో విజయోత్సవాలు మొదలయ్యాయి. టీమిండియా విజయం సాధించాలంటే మరో 81 పరుగులు చేయాలి. కేవలం జడేజా మాత్రమే క్రీజులో ఉన్నాడు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప గిల్ సేన విజయం సాధించడం కష్టమనే చెప్పాలి.
Also Read: మేజర్ లీగ్ క్రికెట్ విజేతగా ముంబై ఇండియన్స్
ఇక తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 387 పరుగులుకు ఆలౌట్ అయింది. జో రూట్ సెంచరీతో రాణించాడు. అలాగే భారత్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ 100 పరుగులు చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 192 పరుగులకు ఆలౌట్ అయింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమి అంచుకు చేరింది.