Saturday, November 15, 2025
HomeఆటAnshul Kamboj: గాయంతో భారత ఆటగాడు దూరం..ఎవరు వస్తారంటే?

Anshul Kamboj: గాయంతో భారత ఆటగాడు దూరం..ఎవరు వస్తారంటే?

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం గాయపడిన అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో భారత ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ జట్టులో చేరనున్నారు. జులై 23 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో భారత బౌల‌ర్‌ అర్ష్‌దీప్ చేతికి గాయ‌మైంది. దీంతో అత‌ని స్థానంలో హ‌ర్యానా బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు.

- Advertisement -

రంజీలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ 
రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా అన్షుల్ కాంబోజ్ రికార్డుకెక్కాడు. 2024-25 సీజన్‌ రంజీ ట్రోఫీలో కేరళతో రోహ్‌తక్‌లో జరిగిన ఐదవ రౌండ్ మ్యాచ్‌లో హర్యానా తరఫున ఇతను 30.1 ఓవర్లలో 10/49గా నమోదు చేసి అద్భుతమైన ఘనతను సాధించాడు.

ఇలాంటి ప్రదర్శనతో 24 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ రంజీ ట్రోఫీ చ‌రిత్ర‌లో నిలిచిపోయే రికార్డును సాధించాడు. అయితే ఈ రికార్డులో ఇతని కంటే ముందు బెంగాల్‌కు చెందిన ప్రేమాంగ్షు ఛటర్జీ (10/20), ప్రదీప్ సుందరం (రాజస్థాన్‌) (10/78) తర్వాత మూడో ఆటగాడిగా అన్షుల్ కాంబోజ్ నిలిచాడు. తన కెరీర్‌లోని ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 3.10 ఎకానమీ, 22.88 సగటుతో 79 వికెట్లు పడగొట్టాడు.

ఇదే విధంగా.. ఐదు మ్యాచ్‌ల టెండూల్క‌ర్‌-అండ‌ర్స‌న్ టెస్టు సిరీస్‌లో 1-2 తేడాతో సిరీస్‌లో భారత్ వెనుకబడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జులై 23 నుంచి ప్రారంభ‌మ‌య్యే నాలుగో టెస్టులో ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని టీమ్ఇండియా కసరత్తులు చేస్తుంది. మ‌రోవైపు 3వ టెస్టులో అద్భుత‌మైన‌ విజ‌యంతో ఇంగ్లండ్ సిరీస్ పై కన్నేసింది.
 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad