IND vs ENG 5th Test Playing 11:భారత్, ఇంగ్లాండ్ మధ్య కీలకమైన ఐదో టెస్టు లండన్‌లోని ఓవల్ వేదికగా జూలై 31 నుండి ఆగస్టు 4, 2025 వరకు జరగనుంది. ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌లో నిర్ణయాత్మకమైన చివరి మ్యాచ్ ఇదే. సిరీస్ లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఇంగ్లండ్ ఉంది. సిరీస్ ను సమం చేయాలంటే టీమిండియా చివరి మ్యాచ్ లో తప్పక గెలవాలి. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో ఇరుజట్లు హోరాహోరీగా పోరాడాయి. ఆఖరి టెస్టులో కూడా అదే మజా ఉంటుందని క్రికెట్ ప్రేమికులు ఆశిస్తున్నారు.
ఐదో టెస్టులో టీమిండియా జట్టులో కొన్ని కీలక మార్పులు చేయనుంది. గత మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సాయి సుదర్శన్ ప్లేస్ లో అభిమన్యు ఈశ్వరన్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్ ఇవ్వవచ్చు. బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ను టీమ్ లో తీసుకోవాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో పక్క బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలా లేదా అనేది కూడా యాజమాన్యం నిశితంగా పరిశీలిస్తోంది. ఇంగ్లండ్ జట్టు ఆల్ రౌండర్ జామీ ఓవర్టన్‌ను తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే గాయంతో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ స్టోక్స్ ఆడతాడా లేదా అని తెలియాల్సి ఉంది.
Also Read: Divya Deshmukh- చరిత్ర తిరగరాసిన దివ్య దేశ్‌ముఖ్ .. చెస్ ప్రపంచకప్ విజేతగా నాగపూర్ అమ్మాయి!
ఇరు జట్లు ప్లేయింగ్ XI
టీమిండియా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్
ఇంగ్లాండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్


