IND vs Oman Asia Cup 2025: ఆసియా కప్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు ఆటగాళ్లు ఒమన్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచారు. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 8 వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఒమన్ ముందు 189 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(38) స్కోరుతో చెలరేగగా.. సంజూ శాంసన్ (56) అర్ధ శతకంతో చెలరేగాడు.
టీమిండియా అలవోకగా 200 కొడుతుందని అభిమానులు భావించారు. కానీ, మిడిల్ ఓవర్లలో ఒమన్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 200 స్కోరుకి బ్రేక్ పడింది. కానీ తిలక్ వర్మ(29), అక్షర్ పటేల్ (26)లు బౌండరీలతో విధ్వంసం సృష్టించడంతో జట్టు భారీ స్కోర్ సాధించింది. దాంతో, సూర్యకుమార్ యాదవ్ సేన నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
Also Read: https://teluguprabha.net/sports-news/ind-vs-oman-asia-cup-2025-abudabi/
పవర్ ప్లేలో వరుసగా బౌండరీలతో అలరించిన అభిషేక్ శర్మ(31) వికెట్ కీపర్ వినాయక శుక్లాకు దొరికిపోయాడు. ఇక జితెన్ రమాదిన్ ఓవర్‌లో నాన్‌స్ట్రయికర్ హార్దిక్ పాండ్యా(1) అనూహ్యంగా రనౌట్ అయి ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. షకీల్ అహ్మద్ బౌలింగ్‌లో 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయి శుభ్‌మన్ గిల్ పెవిలియన్ చేరాడు. దాంతో.. టీమిండియా 71 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
అయినా.. సంజూ శాంసన్ (37 నాటౌట్), అక్షర్ పటేల్(10 నాటౌట్) ధనాధన్ ఆడటంతో స్కోర్ 10 ఓవర్లకే 100కు చేరింది. ఆ తర్వాత సంజూ శాంసన్ (37 నాటౌట్) జతగా ఒమన్ బౌలర్లకు అభిషేక్ శర్మ(31) చుక్కలు చూపించాడు. తనదైన పవర్ హిట్టింగ్ చేసిన అభిషేక్.. షకీల్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 16 రన్స్ సాధించాడు. రమాదిన్ ఓవర్‌లో బంతి ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతుల్లో పడటంతో అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్ ముగిసింది. అయితే.. హాఫ్ సెంచరీ తర్వాత శాంసన్, తిలక్ వరుసగా ఔట్ కావడం నిరాశపరిచింది. దీంతో టీమిండియా రెండొందల మార్క్‌కు 12 పరుగుల దూరంలో ఆగిపోయింది.


