Saturday, November 15, 2025
HomeఆటJaismine Lamboria: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్‌ సంచలనం.. తొలిసారి గోల్డ్‌ మెడల్‌ కైవసం

Jaismine Lamboria: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్‌ సంచలనం.. తొలిసారి గోల్డ్‌ మెడల్‌ కైవసం

India Gold medal in World Boxing Championship : ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌లో శనివారం (సెప్టెంబర్ 13) జరిగిన బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ జాస్మిన్ చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ సాధించిన పోలండ్‌కు చెందిన జూలియా జెరెమెటాతో తలపడి, 4-1 తేడాతో తొలిసారి గోల్డ్‌ మెడల్‌ గెలుచుకుంది. భారత్ తరఫున ఈ ఈవెంట్‌లో తొలి గోల్డ్ మెడల్‌ను సాధించిన మహిళగా రికార్డుకెక్కింది. మ్యాచ్ మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడిన జాస్మిన్.. ఆపై దూకుడు పెంచి అద్భుతమైన పంచ్‌లతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. తన విజయం గురించి జాస్మిన్‌ మాట్లాడుతూ.. “2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఓటమి తర్వాత మానసికంగా, భౌతికంగా చాలా ఇంప్రూవ్‌ అయ్యాను. నేను కన్సిస్టెంట్‌గా, పట్టుదలగా చేసిన ప్రాక్టీస్‌కు గొప్ప ఫలితం దక్కింది. ఆ ఫలితమే ఈ గోల్డ్ మెడల్” అంటూ భావోద్వేగానికి గురైంది.

- Advertisement -

నుపుర్, పూజా రాణికి బ్రాంజ్‌ మెడల్స్..
మరోవైపు, వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఈవెంట్లో ఇండియా బాక్సర్లు నుపుర్, పూజారాణిలు కూడా పథకాలు సాధించారు. పూజా రాణి బ్రాంజ్(కాంస్యం) మెడల్ అందుకోగా.. నుపుర్ 80 కేజీల కేటగిరీలో బ్రాంజ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు. ఇక, ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మహిళా బాక్సర్లు నాలుగు పతకాలు ఖరారు చేసుకొని భారత్‌ పరువును నిలబెట్టారు. 57 కేజీల విభాగంలో జైస్మీన్‌ లంబోరియా ఫైనల్లోకి దూసుకెళ్లి పసిడి పతకం సాధించగా, 48 కేజీల విభాగంలో మీనాక్షి హుడా సెమీఫైనల్లోకి ప్రవేశించి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. కాగా, 80 కేజీల విభాగంలో పూజా రాణి సెమీఫైనల్‌ చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.

ఇషా సింగ్‌కు గోల్డ్‌ మెడల్‌..
మరోవైపు, ఇండియా స్టార్ షూటర్, హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి గోల్డ్ మెడల్‌‌‌ సాధించింది. శనివారం (సెప్టెంబర్ 13)న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇషా ఈ పతకం అందుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్స్‌లో అత్యధికంగా 242.6 స్కోరు చేసిన ఈ 20 ఏండ్ల తెలంగాణ షూటర్ కేవలం 0.1 పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో హోమ్ ఫేవరెట్ యవో క్వియాగ్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. యవో సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టగా.. ఒలింపిక్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సౌత్ కొరియా) బ్రాంజ్ నెగ్గింది. మరో ఇండియన్ రిథమ్ సాంగ్వాన్ కూడా ఫైనల్ చేరినప్పటికీ 18వ షాట్ తర్వాత పతకం రేసు నుంచి తప్పుకుంది. మెన్స్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భవేశ్ షెకావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రదీప్ సింగ్, మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్ రౌండ్లలోనే ఓటమిపాలై ఇంటిదారి పట్టారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad