IND vs ENG 3rd TEST: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అత్యద్భుతంగా ఆడుతోంది. మొదటి ఇన్నింగ్‌లో అద్భుతంగా ఆడిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్లో కూడా చాలా బాగా ఆడింది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 192 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు విజయ లక్ష్యంగా 193 పరుగులు అందింది. నాల్గో రోజు ఆటలో ఇంగ్లాండ్ 175/6తో ఆట ప్రారంభించి, చివరి నాలుగు వికెట్లు కేవలం 17 పరుగులకే కోల్పోయింది.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ హైలెట్స్:
జో రూట్ 40 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు (96 బంతుల్లో)
కెప్టెన్ బెన్ స్టోక్స్ 33 పరుగులు చేశాడు (96 బంతుల్లో 3 ఫోర్లు)
హ్యారీ బ్రూక్ 23 పరుగులు (19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)
జాక్ క్రాలీ (22), డకెట్ (12) మాత్రమే మరో రెండు అంకెలలో స్కోరు చేసిన ఆటగాళ్లు
ఓలీ పోప్ (4), జేమీ స్మిత్ (8), బ్రైడన్ కార్స్ (1) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు
భారత బౌలర్ల పర్ఫార్మెన్స్:
వాషింగ్టన్ సుందర్ చక్కటి బౌలింగ్‌తో నాలుగు కీలక వికెట్లు తీసి (4/22), ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను కూలదొచ్చాడు
మోహమ్మద్ సిరాజ్, బుమ్రా చెరో రెండు వికెట్లు
నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ చెరో వికెట్ తీశారు
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు ఒక్కోసారి 387 పరుగులకు ఆలౌటయ్యాయి. ఇప్పుడు భారత్ ముందుగా 193 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. ఈ లక్ష్యాన్ని చేధించగలదా భారత్? లేదంటే ఇంగ్లాండ్ మళ్లీ తిరిగొస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.


