Saturday, November 2, 2024
HomeఆటIND vs NZ: లంచ్ బ్రేక్.. గిల్, పంత్ అర్థ సెంచరీలు

IND vs NZ: లంచ్ బ్రేక్.. గిల్, పంత్ అర్థ సెంచరీలు

IND vs NZ| న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ పుంజుకుంది. ఓవర్‌నైట్ స్కోర్ 86/4 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఆటగాళ్లు శుభమన్ గిల్, రిషబ్ పంత్.. కివీస్ బౌలర్లను ధీటు ఎదుర్కొన్నారు. సింగిల్స్ తీస్తూ ఆడపదడపా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును నెమ్మదిగా పరిగెత్తించారు. ఈ క్రమంలోనే గిల్, పంత్ అర్థసెంచరీలు నమోదుచేశారు. అయితే 60 పరుగుల వద్ద పంత్ ఔట్ అయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 195/5 పరుగులు చేసింది. ప్రస్తుతం గిల్(70), జడేజా(10) పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ సేన మరో 40 పరుగులు వెనకబడి ఉంది. ఇక కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 2 వికెట్లు.. హెన్రీ, ఇష్ సోదీ చెరో వికెట్ తీశారు.

- Advertisement -

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆతిథ్య కివీస్ జట్టు 259 పరుగులకు ఆలౌట్ అయిందతి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన.. బ్యాటింగ్‌లో అదే పేలవ తీరు కనబర్చింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులు మాత్రమే చేసింది.కెప్టెన్ రోహిత్ శర్మ (18), విరాట్ కోహ్లీ (4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ (30) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. చివర్లో నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన మహ్మద్ సిరాజ్(0) కూడా ఎల్బీగా పెవిలియన్ బాట పట్టాడు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టును భారత్‌ స్పిన్నర్లు ఆది నుంచే కట్టడి చేశారు. ఓపెనర్లు లాథమ్‌ (28), కాన్వే (4) తక్కువ పరుగులకే ఔట్ చేశారు. అయితే విల్‌ యంగ్‌ (71), మిచెల్‌ (81) మాత్రం క్రీజులో పాతుక్కుపోయి స్కోర్ బోర్డును పరిగెత్తించారు. తర్వాత వీరిద్దరు ఔట్ కావడంతో మిగిలిన బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5, వాషింగ్టన్‌ సుందర్‌ 4 వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన జడేజా మరో ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో మొత్తం 314 వికెట్లు తీసి టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు. కాగా ఇప్పటికే తొలి రెండు టెస్టులు కోల్పోయిన భారత్.. మూడో టెస్టులోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News