ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ వార్త క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నిస్తున్నాడని బీసీసీఐ(BCCI) గుర్తించింది. దీనిపై అన్ని ఐపీఎల్ జట్లను అప్రమత్తం చేస్తూ వార్నింగ్ ఇచ్చింది. ఈ వ్యాపారవేత్త ఐపీఎల్ జట్ల యజమానులు, ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లను కూడా టార్గెట్ చేస్తూ అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయడానికి ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని గుర్తించింది.
ఈ హైదరాబాద్ వ్యాపారవేత్తకు బుకీలు, బెట్టింగ్ సిండికేట్‌లతో సంబంధాలు ఉన్నాయని హెచ్చరించింది. తనను సామాన్య అభిమానిగా చిత్రీకరిస్తూ ఖరీదైన బహుమతులు, ఆభరణాలు, లగ్జరీ సౌకర్యాలతో ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. అలాగే ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, జట్టు యజమానులను, విదేశాల్లో నివసిస్తున్న వారి బంధువులను కూడా సోషల్ మీడియా ద్వారా సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనుమానంఎ వ్యక్తం చేసింది.