Monday, November 17, 2025
HomeఆటJadcharla: విద్యార్థులు పట్టుదలతో సాధించాలి

Jadcharla: విద్యార్థులు పట్టుదలతో సాధించాలి

స్పోర్ట్స్ హాస్టల్ కు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్

ప్రతి విద్యార్థి పట్టుదలతో అనుకున్న విజయాన్ని సాధించాలని కొడుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాసులు అన్నారు. జడ్చర్ల మండలం కోడుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి విజయ్ హ్యాండ్ బాల్ స్పోర్ట్స్ హాస్టల్ కు సెలెక్ట్ కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు విద్యార్థి విజయ్ ని అభినందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మారుమూల గ్రామంలో ఉండి క్రీడల్లో ప్రతిభ కనబరిచి స్పోర్ట్స్ హాస్టల్ కు సెలెక్ట్ అవడం అభినందనీయమని, విద్యార్థులు శ్రద్ధ, పట్టుదలతో చదివి ఉన్నత విజయాలను సాధించాలని అన్నారు. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పి శంకర్ నాయక్, ఎం రవి కుమార్ గౌడ్, సి అశోక్ తదితరులు విద్యార్థిని అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad