Thursday, April 3, 2025
HomeఆటMike Tyson vs Jake Paul: మైక్ టైసన్‌ను ఓడించిన ప్రముఖ యూట్యూబర్

Mike Tyson vs Jake Paul: మైక్ టైసన్‌ను ఓడించిన ప్రముఖ యూట్యూబర్

దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్‌(58)ను ప్రముఖు యూట్యూబర్ జేక్ పాల్(27) ఓడించారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగ్‌లోకి దిగిన టైసన్.. మునుపటిలా ఆడలేకపోయారు. ఔట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందుకు పాల్‌ను టైసన్ చెంపదెబ్బ కొట్టడంతో మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది. మ్యాచ్ ప్రారంభం కాగానే తొలి రెండు రౌండ్లలో టైసన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే ఆ ఊపును చివరి రౌండ్ వరకు కొనసాగించలేకపోయాడు.

- Advertisement -

టైసన్ – జేక్ పాల్ మధ్య మొత్తం 8 రౌండ్లు జరిగాయి. టైసన్ రెండు రౌండ్లలోనే గెలవగా..ఆరు రౌండ్లలో పాల్ విజయకేతనం ఎగరేశాడు. దీంతో 10-9, 10-9, 9-10, 9-10, 9-10, 9-10, 9-10, 9-10 తేడాతో పాల్ విజయం సాధించాడు. తొలి రెండు రౌండ్లలో ఆధిప్యతం ప్రదర్శించిన టైసన్.. తర్వాతి రౌండ్లలో మాత్రం వెనకబడిపోయాడు. బౌట్ అనంతరం వీరిద్దరూ ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం విశేషం. కాగా 2005లో కెవిన్‌ చేతిలో ఓటమి తర్వాత ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌కు టైసన్‌ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల తర్వాత బౌట్‌లో తలపడటం కోసం టైసన్‌ సుమారు రూ.168 కోట్లు అందుకోగా.. పాల్‌ దాదాపు రూ.337 కోట్లు అందుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News