రాష్ట్రస్థాయిలో 11వ తెలంగాణ స్టేట్ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో కామారెడ్డికి చెందిన గిరిగంటి లక్ష్మీనారాయణ రాష్ట్ర స్థాయిలో నాలుగవ స్థానంలో నిలిచారు. హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో భాగంగా 10 కిలోమీటర్ల రన్నింగ్ పోటీల్లో పాల్గొన్న లక్ష్మీనారాయణ 45 వయసు వారిలో 10 కిలోమీటర్ల దూరం 47 నిమిషాల్లో పూర్తిచేసి రాష్ట్రస్థాయిలో పాల్గొన్న 33 జిల్లాల వారిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి నాలుగవ స్థానంలో నిలిచారు. దీంతో కామారెడ్డి పట్టణంలోని పలువురు అభినందించారు.