Kapildev| భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజండరీ ఆటగాడు కపిల్‌దేవ్(Kapildev).. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు(CM Chandrababu) నివాసంలో ఆయనను కలిశారు. కపిల్‌దేవ్‌తో విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ACA) అధ్యక్షుడు కేశినేని చిన్ని కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటుపై చంద్రబాబుతో కపిల్‌దేవ్ చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
క్రీడలపై సీఎం చంద్రబాబు చాలా ఆసక్తిగా ఉన్నారని కపిల్‌దేవ్ తెలిపారు. తమ మధ్య గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగిందన్నారు. ప్రస్తుంత ఇండియన్ గోల్ఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నానని. ఎక్కడ భూమి ఇస్తారనేది ప్రభుత్వానిదే తుది నిర్ణయమని చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ సిటీలో ఇస్తే ఇంకా మంచిదని వెల్లడించారు.
అనంతపురం, అమరావతి, విశాఖలో గోల్ఫ్‌కోర్సులు పెడతామని కేశినేని చిన్ని(Kesineni Chinni) తెలిపారు. ఏపీ అంబాసిడర్‌గా ఉండాలని కపిల్‌దేవ్‌ను కోరామన్నారు. రాష్ట్రంలో గోల్ఫ్ క్రీడ అభివృద్ధి చేయాలనే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. ఏపీ క్రీడాకారులు అంతర్జాతీయంగా ఆడేలా చేస్తామని.. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ క్రీడాకారులను వెలికి తీస్తామని ఆయన స్పష్టంచేశారు.