Tuesday, September 17, 2024
HomeఆటKarimnagar: పవర్ లిఫ్టింగ్ లో పులి ఆంజనేయులుకు పతకాల పంట

Karimnagar: పవర్ లిఫ్టింగ్ లో పులి ఆంజనేయులుకు పతకాల పంట

కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత పులి ఆంజనేయులు గౌడ్ పతకాల పంట సాధించారు.  హైదరాబాద్ శంషాబాద్ లో తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో భాగంగా గత రెండు రోజులుగా జరిగిన పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ పోటీల్లో పాల్గొన్న ఆంజనేయులు .. మాస్టర్స్ వన్ 93 కేజీల ఎక్విప్మెంమెంట్ విభాగంలో మొత్తం 350 కేజీల విభాగంలో బంగారు పతకం, క్లాసికల్ విభాగంలో 335 కేజీలతో  వెండి పతకం సాధించారు.

- Advertisement -

రెండు నెలల క్రితం పవర్ లిఫ్టింగ్ లో  జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన పులి ఆంజనేయులు గౌడ్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి.  త్వరలో జరుగబోయే అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో దేశానికి పతకం సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్టు, తప్పకుండా బంగారు పథకం సాధిస్తానని పులి ఆంజనేయులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఈసందర్భంగా పులి ఆంజనేయులు గౌడ్ ని కోచ్ మల్లేష్ అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News