Sunday, July 7, 2024
HomeఆటKarimnagar: 12 విభాగాల్లో పోలీసుల స్పోర్ట్స్ మీట్

Karimnagar: 12 విభాగాల్లో పోలీసుల స్పోర్ట్స్ మీట్

ఆటవిడుపులో మునిగి తేలిన ఖాకీలు

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులకు నిర్వహించిన 2024 వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్టీజోన్ ఐ.జి.- 1 ఎ. వి . రంగనాథ్, ఐపీఎస్. హాజరయ్యారు.

- Advertisement -

జట్ల వారీగా స్పోర్ట్స్ పెరేడ్ నిర్వహించారు. తదనంతరం స్పోర్ట్స్ మీట్ లైట్ వెలిగించారు. రెండు రోజులపాటు జరిగిన ఆటలు క్రీడలను ఒక ఏవీ రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్బంగా మల్టీజోన్ ఐ.జి.- 1 ఎ.వి. రంగనాథ్, ఐపీఎస్. మొన్నటి వరకు ఎన్నికల హడావుడి వుండి మరో నాలుగు రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ ఉండగా ఈ మధ్య గల అతి తక్కువ విరామంలో విధుల్లో నిమగ్నమై వున్న పోలీసులకు అతి తక్కువ సమయంలో చాలా గొప్పగా ఈ మీట్ నిర్వహించారన్నారు. ఇందుకు గాను పోలీస్ కమిషనర్ ను అభినందించారు.

నిత్యం విధుల్లో వుండే పోలీసులకు ఇటువంటి ఆటల వలన మానసికోల్లాసమే కాకుండా శారీరక ధృడత్వంతో పాటు ఆత్మవిశ్వాసమూ పెంపొందుతుందన్నారు. ఈ మీట్ లో భాగంగా సిబ్బందికి అథ్లెటిక్స్ ,వాలీబాల్ , ఫుట్ బాల్ , క్రికెట్, బ్యాడ్మింటన్ , హ్యాండ్ బాల్, కబడ్డీ లతో పాటు మొత్తం 12 క్రీడల్లో పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News