ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ తొలి మ్యాచ్ లో.. కేకేఆర్ ధనాధన్ మెరుపులతో సీజన్ గ్రాండ్ గా ప్రారంభించింది. ఈడెన్ గార్డెన్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరుగుతున్న పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ KKR 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు జట్టుకు 175 టార్గెట్ అందించింది. ఈ మ్యచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ కు కెప్టెన్ అజింక్యా రహానే (56), సునీల్ నరైన్ (44) పరుగులతో మెరుపులు మెరిపించారు.
వీరిద్దరు మినహా మిగిలిన వారు ప్రభావం చూపలేకపోయారు. క్వింటన్ డి కాక్ (4) ఆండ్రీ రస్సెల్ (4), రింకు సింగ్ (12), వెంకటేష్ అయ్యర్ (6) విఫలం అవడంతో భారీ స్కోర్ చేయలేకపోయింది. కీలక సమయాల్లో వికెట్లు తీసిన ఆర్సీబీ కేకేఆర్ ను 200 మార్కును దాటకుండా చూసుకుంది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా 3 వికెట్లతో మెరిశాడు. హేజల్ వుడ్ కు 2 వికెట్లు తీసుకున్నారు.