Tuesday, September 17, 2024
HomeఆటKoppula: సీఎం కప్ క్రీడోత్సవాలు ప్రారంభం

Koppula: సీఎం కప్ క్రీడోత్సవాలు ప్రారంభం

సీఎం కప్‌ పోటీల్లో భాగంగా వివేకానంద మినీ స్టేడియంలో సీఎం కప్‌ 2023 జిల్లా స్థాయి క్రీడోత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, డా సంజయ్ కుమార్, ఎంపీ వెంకటేష్ నేత, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ముఖ్యమంత్రి కప్ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఈ పోటీలునిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్రీడలతోనే క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదల అలవడుతాయన్నారు. క్రీడలను, క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి పేరు మీద క్రీడా పోటీల‌ను నిర్వ‌హించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. మే 31వ తేదీ వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తామ‌ని పేర్కొన్నారు.

- Advertisement -

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ 2023 పేరిట క్రీడా పోటీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఈ అవకాశాన్ని గ్రామీణ యువత సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా రాణించాలని సూచించారు. ప్రస్తుత కాలంలో ఆరోగ్యవంతమైన జీవితం కేవలం క్రీడల ద్వారా మాత్రమే దొరుకుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలపై ఆసక్తిని పెంచేలా ప్రోత్సహించాలన్నారు. హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారు లు ప్రతిభచూపాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పోటీల్లో జిల్లా జట్లు అత్యధిక విజయాలను నమో దు చేసి పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి అథ్లెటిక్స్‌, ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, రెజ్లింగ్‌, టెన్నిస్‌ కేటగిరీల్లో పోటీలను క్రీడాకారులతో కలిసి ఆడారూ అనంతరం క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష,అదనపు కలెక్టర్ మంద మకరంద్,DCMS చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, లైబ్రరీ చైర్మెన్ చంద్రశేఖర్ గౌడ్,మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్, మరియు జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సంబంధిత ఆధికారులు, క్రీడాకారులు ప్రజా ప్రతినిధిలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News