Sunday, July 7, 2024
HomeఆటKurnool: 'ఆడుదాం ఆంధ్ర'లో కర్నూలు క్రీడాకారుల ప్రతిభ

Kurnool: ‘ఆడుదాం ఆంధ్ర’లో కర్నూలు క్రీడాకారుల ప్రతిభ

రాష్ట్రస్థాయిలో జిల్లాకు 2, 3వ స్థానాలు

ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో కర్నూలు జిల్లా క్రీడాకారులు వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీ క్రీడల్లో రెండు, మూడవ స్థానాలను సాధించారు. క్రీడాకారులను, నేతృత్వం వహించిన డి.ఎస్.డి.ఓ శ్రీనివాసరావును కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన అభినందించారు. విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఆడుదాం ఆంధ్ర క్రీడలలో బాలికల వాలీబాల్ క్రీడలో రాష్ట్రంలో రెండవ స్థానం, షటిల్ బ్యాడ్మింటన్ లో మూడవ స్థానం, బాలుర కబడ్డి క్రీడలో మూడవ స్థానం సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ అభినందించారు.

- Advertisement -

క్రీడాకారులు సాధించిన ట్రోఫీలు , మెడల్స్ , సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు మన జీవితంలో ఎల్లప్పుడూ భాగమై ఉండాలని , క్రీడల వలన ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండవచ్చని, క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, సమైక్య భావం పెరుగుతుందని, క్రీడలతోపాటు చదువులో కూడా బాగా రాణించాలన్నారు. ఫిబ్రవరి 9 నుండి 13 ఫిబ్రవరి వరకు జరిగిన రాష్ట్రస్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడలలో కర్నూలు జిల్లా మామిదాలపాడుకు చెందిన క్రీడాకారులు వాలీబాల్ ఆటలో, ఇతర క్రీడాకారులు బ్యాడ్మింటన్ , కబడ్డీ క్రీడలలో మంచి నైపుణ్యం ప్రదర్శించారని వీరందరిని జిల్లా కలెక్టర్ అభినందించి భవిష్యత్తులో వీరు పాల్గొనే క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలియ జేశారని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ అభినందన కార్యక్రమంలో సీఈవో సెట్కూర్ రమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News