Thursday, December 12, 2024
HomeఆటKurnool: రాయలసీమ యూనివర్సిటీలో క్రీడాకారులకు సన్మానం

Kurnool: రాయలసీమ యూనివర్సిటీలో క్రీడాకారులకు సన్మానం

ఖేలో

సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ మహిళా టోర్నమెంట్ లో మంచి ప్రతిభ కనబరిచి తృతీయ స్థానంలో నిలిచిన వర్సిటీ క్రీడాకారులను రాయలసీమ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎన్ టి కే నాయక్ అభినందిస్తూ సన్మానం చేశారు.

- Advertisement -

నవంబర్ 26 నుండి 30 వరకు వీటీయూ బెలగావి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో రాయలసీమ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ మహిళా జట్టు ప్రతిభ కనబరిచి 2024 – 25 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కు బ్యాడ్మింటన్ మహిళా జట్టు అర్హత సాధించిన సందర్భంగా వర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం క్రీడాకారులు, కోచ్ లకు సోమవారం వీసీ ప్రొఫెసర్ ఎన్టికె నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి విజయ్ కుమార్ నాయుడు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్, మే నెలలో జరిగే ఖేలో ఇండియా పోటీలలో కూడా విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఖేల్ ఇండియా పోటీల్లో వరుసగా మూడుసార్లు అర్హత సాధించిన ఏకైక విశ్వవిద్యాలయం మనదేనన్నారు. వర్సిటీకి ఖ్యాతి తీసుకొచ్చినందుకు జట్టు సభ్యులు ఎం ఆకాంక్ష, ఎన్ జాహ్నవి, సిహెచ్ఎస్ఆర్ ప్రణవి, ఎల్ మామైక్య లను
జ్ఞాపికలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కేవీ శివ కిషోర్, శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఇంగ్లీషు ల్యాబ్ ను ప్రారంభించిన వీసీ

వర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఆధునికరించిన లాంగ్వేజ్ ల్యాబ్ ను వీసీ ఎన్ టి కె నాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించడానికి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ను ఆధునికరించామని ఇంగ్లీషు భాష సాహిత్యాలను అభ్యసిస్తున్న విద్యార్థులు లాంగ్వేజ్ ల్యాబ్ ల లోని సౌకర్యాలను వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ప్రముఖ ఆంగ్ల కవి జాన్ మిల్టన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ పి శ్రీనివాసులు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆచార్య ఎన్ నరసింహులు, అధ్యాపకులు జాయిస్, డాక్టర్ సురేఖ రాణి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News