Monday, September 23, 2024
HomeఆటKurnool: దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి రేష్మ

Kurnool: దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి రేష్మ

అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ లో 4 పతకాలు

దేశం గర్వపడే విధంగా కర్నూలు జిల్లా క్రీడాకారిణి రేష్మ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సీనియర్ విభాగంలో నాలుగు పతకాలు సాధించిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అభినందించారు. నేపాల్ లో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సీనియర్ విభాగంలో 3 స్వర్ణాలు, 1 సిల్వర్ పథకాలు సాధించిన రేష్మను కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో శాలువ, పుష్పగుచ్చంతో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సత్కరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేపాల్ దేశంలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ 57వ సీనియర్ విభాగంలో కర్నూలు జిల్లా, బ్రాహ్మణకొట్కూరుకు చెందిన రేష్మ నాలుగు పతకాలు సాధించడం క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రోత్సహించారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ తెలిపారు.

కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఎస్డిఓ భూపతి రావు, పవర్ లిఫ్టింగ్ శిక్షకుడు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News