Saturday, April 5, 2025
HomeఆటMallapur: వేంపల్లి టీందే కప్

Mallapur: వేంపల్లి టీందే కప్

బహుమతి ప్రదానం చేసిన ఎమ్మెల్యే సంజయ్

మల్లాపూర్ మండల కేంద్రంలోని కె వి ఎస్ ఆర్ క్రీడ మైదానంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్ లో వేంపల్లి, రాయికల్ జట్టు తలపడగా వేంపల్లి జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు కోరుట్ల శాసన సభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ బహుమతులతో పాటు నగదు ప్రోత్సాహం అందించారు.

- Advertisement -

గెలుపు ఓటమి సహజమని, క్రీడా స్ఫూర్తి ప్రతి ఒక్కరు కనబరిచాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రీడల పట్ల ఆసక్తి చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సంది రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ రాజేష్, టోర్ని నిర్వాహకులు మేకల. సతీష్, మల్లాపూర్ బి ఆర్ యస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ లింగ స్వామి, సీనియర్ బి ఆర్ యస్ నాయకులు క్యాతం. జీవన్ రెడ్డి, కొమ్ముల జీవన్ రెడ్డి, బిట్ల నరేష్, క్రికెట్ క్రీడాకారులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News