Saturday, November 23, 2024
HomeఆటRugby: రగ్బీలో మెదక్ కు వెండి పతకం

Rugby: రగ్బీలో మెదక్ కు వెండి పతకం

67 వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 టచ్ రగ్బీ పోటీలలో మెదక్ జిల్లాకు బాలికల విభాగంలో రెండవ స్థానం పొంది వెండి పతాక సాధించిందని కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. ఈనెల 10,11,12వ తేదీలలో మేడ్చల్ జిల్లా కేంద్రంలోని కేఎల్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన పోటీలలో ఉమ్మడి తెలంగాణలోని పది జిల్లాల టీములు పాల్గొనగా మెదక్ జిల్లా మంచి ప్రతిభ చూపి వెండి పథకం సాధించింది. ఫైనల్ పోటీల్లో మహబూబ్ నగర్ జిల్లాతో జరిగిన పోటీలో హోరాహోరి తలపడి రెండవ స్థానం సాదించింది.బాలికల విభాగం లో వెండి పథకం సాధించిన వారిలో గాయత్రి, లాస్య, దివ్య, కావ్య, గ్రీష్మ, సాయి ప్రత్యుశ, శ్రీవాని, సారిబా, నందిని, వైష్ణవి, రాణికుమారి, వర్షశ్రీ ఉన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రమేష్, పిడిలు శారదా, వెంకటేష్, పి.ఈ.టి చంటి, శ్రీనాథ్ పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా బాలికలు వెండి పథకం సాధించడం పట్ల మెదక్ జిల్లా డి.ఈ. ఓ రాధాకృష్ణ, చేగుంట జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు నీరజ, ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూపాల్ రెడ్డి, శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ వివేక్, ఇతక్షిలా స్కూల్ ప్రిన్సిపాల్ శరత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News