మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెం ఐఎంఏ కార్యాలయం నందు డైమండ్ చెస్ అకాడమి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ -19 ఉమ్మడి నల్గొండ జిల్లా చెస్ టోర్నమెంట్ ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి నిర్వాహకులతో కలసి చెస్ ఆడారు. అనంతరం వారు మాట్లాడుతూ పిల్లలు చెస్ క్రీడలు ఆడటం వలన పిల్లల మేధస్తు మెరుగుపడటంతో పాటు మానసికంగా బలంగా తయారు అవుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బి ఎల్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.