సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరిగిన మ్యాచ్‌లో SRH బ్యాటింగ్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 163 పరుగులకే ఆలౌటైంది. టీమ్ టాప్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేయగా, ఢిల్లీ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు SRH బ్యాటర్లు కుదేలయ్యారు. స్టార్క్ వరుసగా ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలను పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్ మొత్తం ఐదు వికెట్లు తీసి SRHకు భారీ షాక్ ఇచ్చాడు.
హైదరాబాద్ జట్టులో అనికేత్ వర్మ (Aniketh Verma) ఒక్కరే ఆకట్టుకున్నారు. కేవలం 41 బంతుల్లో 74 పరుగులు చేసిన అనికేత్ ఆరు సిక్సులు, ఐదు ఫోర్లతో విరుచుకుపడ్డారు. క్లీన్ హిట్టింగ్‌తో ఆకట్టుకున్నా, మిగతా బ్యాటర్లు అంచనాలు అందుకోలేకపోయారు. క్లాసిన్ మాత్రమే కొంతసేపు అనికేత్‌కు సహకారం అందించారు. ఢిల్లీ బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్ 5 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, మోహిత్ శర్మ 1 వికెట్ తీశారు.