వచ్చే నెల నుంచి ఐపీఎల్ 2025(IPL 2025) ప్రారంభం కానుంది. రెండు నెలల పాటు జరగనున్న ఈ టోర్నీలో ఇప్పటికే అన్ని ఫ్రాంఛైజీలు జట్లను సిద్ధం చేసుకున్నాయి. మెగా వేలంలో ఆటగాళ్లకు కోట్లు వెచ్చించి దక్కించుకున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్(Mumabai Indians) జట్లులో కీలక మార్పు చేపట్టింది. వేలంలో ఆఫ్ఘానిస్థాన్ బౌలర్ గజన్‌ఫర్‌ను రూ.4.8 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. అయితే వెన్నునొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటు ఉండటం లేదు.
దీంతో అతడి స్థానంలో మరో ఆఫ్ఘాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను రూ.2కోట్లకు జట్టులోకి తీసుకుంది. ముజీబ్‌కు గతంలో ఐపీఎల్ ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. మొత్తం 19 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి మొత్తం 19 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే ముంబై జట్టు స్టార్ బౌలర్ బుమ్రా కూడా వెన్నునొప్పి కారణంగా బాధపడుతున్నాడు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన బుమ్రా ఐపీఎల్‌లో ఆడతాడో లేదో తేలాల్సి ఉంది.