Thursday, December 12, 2024
HomeఆటMulugu: క్రికెట్ ఆడిన కలెక్టర్

Mulugu: క్రికెట్ ఆడిన కలెక్టర్

ప్రజాపాలన విజయోత్సవాల్లో

క్రీడలు ప్రతి ఒక్కరికి శారీరక మానసిక వికాసానికి తోడ్పడి ఆరోగ్యవంతులుగా చేస్తుందని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లోని తంగేడు మైదానంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లా క్రీడల అధికారి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు క్రీడా పోటీలను జిల్లా గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ తో కలిసి ప్రారంభించారు.

- Advertisement -

సీఎం కప్ లో పాల్గొనాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1వ తేది నుండి 8 వ తేది వరకు క్రీడలు నిర్వహిస్తున్నట్టు, దీనిలో భాగంగా గురువారం ప్రజా ప్రతినిధులకు, అధికారులకు క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడల పట్ల ప్రత్యేక ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఈనెల 7, 8 తేదీలలో సీఎం కప్ పోటీలు గ్రామపంచాయితీల పరిధిలో, 10, 12 వ తేదీలలో మండల పరిధిలో 16వ తేదీ నుండి 21 తేదీ వరకు జిల్లా పరిధిలో నిర్వహిస్తామన్నారు. సీఎం కప్ 2024 లో పాల్గొనదలచిన క్రీడాకారులు ఆన్ లైన్ రెజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి తుల రవి, క్రికెట్ కొచ్ సందీప్ పైడిమల్ల, కబడ్డీ కోచ్ పి.జనార్దన్, హ్యాండ్ బాల్ కోచ్ కుమార స్వామి, ఉద్యోగస్తులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News