Friday, June 28, 2024
HomeఆటNandyala: క్రీడలతో దృఢ సంకల్పం అంకితభావం, అలవర్చుకోండి

Nandyala: క్రీడలతో దృఢ సంకల్పం అంకితభావం, అలవర్చుకోండి

నంది పైప్స్ బ్యాడ్మింటన్ అకాడమి సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. అకాడమి గత ఇరవై రెండు సంవత్సరాలుగా నిరంతరం నిపుణులైన క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిచదిద్దుతున్నదన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు రాష్ట్ర బాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు కే వంశీధర్ మరియు జిల్లా బాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు వి. శేషిరెడ్డి, సభ్యులు వెంకట్ మరియు అకాడమీ కోచ్ నాగార్జున్ రెడ్డి పాల్గొన్నారు. వంశీధర్ మాట్లాడుతూ గత ముప్పై రోజులుగా జరిగిన ఈ క్యాంప్ లో పాల్గొన్న క్రీడాకారులు వివిధ క్రీడా నైపుణ్యాలను అభ్యసించి, తమ ఆటను మరింత మెరుగుపరచుకున్నారు. ఇది వారి కృషి, సంకల్పం ఫలితమన్నారు. ఈ క్యాంప్ వారికి కేవలం క్రీడా నైపుణ్యాలనే కాకుండా, జీవితంలో సాధించాలనే దృఢ సంకల్పం, అంకితభావం కూడా అలవరచుకునేలా చేస్తుందన్నారు.

గత 23 సంవత్సరాల నుండి అకాడమీలో ఇలాంటి కోచింగ్ కాంప్ నిర్వహిస్తున్నామని, ఈ సమ్మర్ కోచింగ్ కాంప్ నుండే నైపుణ్యం గల క్రీడాకారులను వెలికి తీసి ఎందరో అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ అకాడమీకి కలదని అన్నారు. క్యాంప్ లో పాల్గొన్న క్రీడాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు. అకాడమి ఈ విజయం అనేక మంది యువ క్రీడాకారులకు ప్రేరణ మరియు మార్గదర్శిగా ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News